3, మే 2018, గురువారం

మీరు నిరుద్యోగుల ! ఐతే ఈ APP మీకోసమే .

అవునండి నిరుద్యోగుల కోసం నా మిత్రుడు బాలు WE JOB MAKERS అనే APP నడుపుతున్నాడు.  https://www.wejobmakers.in
లింక్ ద్వార మీరు మరిన్ని వివరములు తెలుసుకోవచ్చు . https://play.google.com/store/apps/details?id=in.wejobmakers&hl=en 
లింక్ ద్వార APP ను దిగుమతి చేసుకోవచ్చు. ఈ APP నందు ముఖ్యంగా TET, DSC, RRB కొరకు మరియు అన్ని రకముల జాబ్స్ కు సంభందించి  ఉపయుక్తమైన సమాచారము మరియు మోడల్ పేపర్ , మాదిరి పరిక్షలు , సిలబస్ , లాంటి సమాచారము తో పాటు గ్రాండ్ టెస్ట్ సదుపాయం కూడా కలదు. 
 

18, డిసెంబర్ 2015, శుక్రవారం

కొత్త క్యాలెండర్ చూసుకొన్నారా !

            ఇది క్యాలెండర్ సీజన్ , ఇంకో పదమూడు రోజులలో కొత్త సంవత్సరం మన ముందుకు రాబోతుంది , మరి రాబోయే కొత్త సంవత్సరం లో అందరు తమ తమ కోరికలు , కలలు తీరుతాయ అని ఎదురు చూస్తూ ఉంటారు.
పెళ్లి కాని వారు పెళ్లి ఎప్పుడుఅవుతుందా అని, పెళ్లి అయిన వారు (కొత్తగ ) ఆషాడం ఎప్పుడు అని, ఉద్యోగస్తులు శెలవలు ఎప్పుడు అని, బ్యాంకు ఉద్యోగస్తులు శనివారాలు ఎప్పుడా అని, ఇలా ఎవరి కి వారు కొత్త క్యాలెండర్ పట్టుకు వేలడతారు.
మరి నిరుద్యోగస్తులు, చదువు కొంటున్నవారికి కొన్ని క్యాలెండర్లు ఉన్నాయి. ఇలాంటి క్యాలెండర్లు ఉంటాయని చాలా మందికి తెలియదు. మరి ఆ క్యాలెండర్లు ఏమిటో మనం ఇప్పడు తెలుసుకొందాం.
ఇవి ఐదు రకాలు :
1. UPSC క్యాలెండర్
2. SSC క్యాలెండర్
3. IBPS క్యాలెండర్
4. APPSC క్యాలెండర్
5 CET క్యాలెండర్

ముఖ్యంగా ఉద్యోగం కోరుకొనే వారు ఈ క్యాలెండర్ చూసుకొని చదువుకొంటే ఉద్యోగం వారిని వెతుకొంటు వస్తుంది.
IBPS, APPSC, CET క్యాలెండర్లు ఇంకా వెలువడలేదు, UPSC, SSC క్యాలెండర్లు వెలువడినవి. వాటి లింకులు క్రింద ఇస్తున్నాను, గమనించండి.
http://upsc.gov.in/exams/calendar/2016/Annual_Calander_2016_Rvsd_Engl.pdf


21, మే 2015, గురువారం

పదవ తరగతి లో మార్కులు తెసుకోవడం ఎలా

పదవ తరగతి లో మార్కులు తెసుకోవడం ఎలా ?
పడవ తరగతి ఫలితాలు వెలువడ్డాయి , అందరు మంచి పాయింట్ లతో పాస్అయ్యారు , మరి ఎన్ని మార్కులు వచాయో తెలుసుకోవడం ఎలా ? ఇదిగో క్రింది పట్టిక లో చూసి మీ పాయింట్ కు ఎన్ని మార్కులు వచ్చయో తెలుసుకోండి .

15, మే 2015, శుక్రవారం

స్వయం ఉపాధి కి మంచి అవకాశం ఉన్న కోర్సు ( AC ఇన్స్టలేషన్ మరియు రిపేర్ కోర్సు )

                                    కస్టపడి పని చేసుకొంటే స్వయం ఉపాధి కి మించిన ఉద్యోగంమరొకటి లేదు. అలాంటి  స్వయం ఉపాధి కోర్సు లలో శిక్షణ కోరుకొనే వారికి హైదరాబాద్ లో ఉన్న MSME - TOOL ROOM ( CENTRAL INSTUTE OF TOOL DESIGN ) ఓక వరం. ఇందులో AC ఇన్స్టలేషన్ మరియు రిపేర్  కోర్సు కొరకు ప్రకటన వెలువడింది . అభిరుచి కలవారు వినియోగించు కోగలరు. అర్హత పదవ తరగతి పాస్ . చివరి తేది 25/5/2015. ఫీజు 3000/-. ఇతర వివరాలకు క్రింది చిరునామా లో సంప్రదించండి.
CITD,
BALANAGAR,
HYDERABAD-500037.
040-23772749, 23771959

http://www.citdindia.org/

4, అక్టోబర్ 2014, శనివారం

మీకు archive.org గురించి తెలుసా? మీరు పుస్తకాల పురుగా ఐతే తెలుసుకోండి .

       మనలో చాలా మంది పుస్తకాల పురుగులం , నిజమే కదా, కాని నేటి కాలంలో పుస్తకాలు కొనడం అన్న , లేదా పాత పుస్తకాలు సేకరించడం అన్న ఎంతో ధన వ్యయం అవసరం. కాని మనకు ఇంటర్ నెట్ ద్వార ఉచితంగా వేల లక్షల పుస్తకాలు, అన్ని భాషల, అన్ని విషయాల పుస్తకాలు కేవలం ఓకే క్లిక్ దూరంలోనే , అవునండి నిజం ఒక్క సారి  క్రింది లింక్ ను క్లిక్ చేయండి , కేవలం పుస్తకాలే కాదు, మంచి పాటలు, సినిమాలు, సాఫ్ట్ వేరులు , అన్ని ఒకే చోట......... 

https://archive.org/

    నేను ఈనాడు ఆదివార అనుభందం  ప్రారంభం నుంచి అన్ని సేకరించినాను, ఒకరోజు మా అమ్మ ఇంట్లో అడ్డం అని వాటిని పాతపేపర్ వాడి వేసింది , ఎంతకో తెలుసా కేవలం 90 రూపాయలకు, ఆ రోజే అనుకొన్న ఇంకెప్పుడు పుస్తకాలు కొనకూడదు అని , కాని తాగుబోతు ఇంకెప్పుడు తాగన్నన్న హామీ ఎంతసేపు , మనది అంతే.
ఇక కంప్యూటర్ వచ్చి నించి ఇంట్లో పుస్తాకాలు అడ్డం అన్న గొడవ లేదు, హాయిగా ఎంచక్కా బుల్లి హార్డ్ డిస్క్ లో
ఒదిగి పోయింది నా లైబ్రరి , మీకు ఓక  విషయం తెలుసా నా డిజిటల్  లైబ్రరిదాదాపు5000పుస్తకాలుఉన్నాయ్ .
పాకుడు రాళ్ళూ, గోన గన్నారెడ్డి , లాంటివే కాకుండా ఎన్నో రకాల నిఘంటువు లు, త్రి భాష పుస్తకాలు , ముక్యమైన పేపర్ కటింగ్ లు, అబ్బోచాల ఉన్నాయ్ , ఇక https://archive.org/ 
పుణ్యమా అని ఇక చెప్పేది ఏముంది ప్రతి రోజు దాదాపు వంద పుస్తకాలు నా లైబ్రరి లో చేరి పోతున్నాయి.

16, జూన్ 2014, సోమవారం

సులభంగా గుణకారములు

ఈ రోజు మనం కొన్ని గుణకారములను ఎలా చేయాలో తెలుసుకుందాం .
1) 5తో అంతమైయేసంఖ్య ల వర్గము
2) 50-60 ల మద్య సంఖ్య ల వర్గము
3) అన్ని తొమ్మిదులు గల సంఖ్యల గుణకారము (9,99,999,9999,99999)
4) అన్ని ఒక్కట్లు గల సంఖ్యల గుణకారము (1,11,111,1111,11111)
ఇప్పుడు మనం 5 అంతమైయేసంఖ్య ల వర్గము ఎలా చేయాలో తెలుసుకుందాం .

ఉదాహరణకు 65x65 అనగా 65 వర్గము

అందరు చేసే పద్ధతి చూద్దం
65x65
------
  325
390
1
------
4225
-------
సులభంగా చేసే పద్దతి

65 లో మనకు 5,6 అనే సంఖ్యలు కలవు .
6 సంఖ్య తరువాత 7 వస్తుంది, 6 ను 7 తో హెచ్చించ్చి (6x7=42) , మిగిలిన 5x5 ను యదావిధిగా వ్రాసుకొంటే సెకన్లలో జవాబు సిద్దం ...

క్రింది ఉదాహరణలు పరిశీలించండి ....
25x25=
2x3=6  5x5=25  జవాబు 625

35x35 =
3x4=12 5x5=25 జవాబు 1225

45x45=
4x5=20  5x5=25 జవాబు 20255x5=25
15x15===========1x2=2,  5x5=25 =============225
25x25===========2x3=6,  5x5=25 =============625
35x35===========3x4=12, 5x5=25=============1225
45x45===========4x5=20 ,5x5=25=============2025
55x55===========5x6=30, ===========3025
65x65===========6x7=42============4225
75x75===========7x8=56============5625
85x85===========8x9=72============7225
95x95===========9x10=90===========9025
105x105=========10x11=110=========11025
115x115=========11x12=132=========13225
125x125=========12x13=156=========15625